తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2023, 14:56

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సీఎం జగన్: పురందేశ్వరి ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆమె విశాఖ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని.. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి వేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఏపిలో నాణ్యతలేని మద్యాన్ని ప్రజలతో తాగిస్తున్నారని.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజమని.. గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్‌లను పూర్తిగా మార్చేశారని.. కొత్త బ్రాండ్‌లను మార్కెట్లోకి తెచ్చి.. వాటి ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో ఉన్న యాజమాన్యాల నుంచి కంపెనీలు లాక్కుని.. పేర్లు మార్చి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీటిని నడుపుతున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే.. ఆయన తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారన్నారు.

ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హానికరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతోందని, రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని.. ఒక్క పరిశ్రమ రాలేదని.. ఇలా అయితే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని పురంధేశ్వరి ప్రశ్నించారు...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2023, 14:49

వచ్చేవారం నారా లోకేశ్‌ 'యువగళం' తిరిగి ప్రారంభం

రాజోలు: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్‌ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు..

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2023, 14:41

సెల్ ఫోన్ కోసం యువకుడు ఆత్మహత్య?

ఫోన్ పోయిందని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.

ఆదివారం ఉదయం జగద్గిరిగుట్ట ఎల్లమ్మ బండలో కెటిఆర్ కాలనీలో నివాసముంటున్న నితీష్ రాజు(26) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోన్ పోయిందని మనస్తాపంతో నితీష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు...

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2023, 14:33

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి దీక్ష

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం నిరసన దీక్షకు దిగనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష చేపట్టనున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు. నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల అరెస్టును బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకూ ఖండించకపోవడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాజకీయాలకు అతీతంగా ఆ అరెస్టును ఖండించాల్సి ఉన్నదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరెస్టులను ఖండించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు ఈ అరెస్టు వ్యవహారంలో కేసీఆర్ మౌనంగా ఉండడాన్ని అదే పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు

ప్రశ్నించడం గమనార్హం...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2023, 17:12

నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం శ్రీ గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న - మాదగాని శ్రీనివాస్ గౌడ్

తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామంలో లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న

BJP రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగాని శ్రీనివాస్ గౌడ్

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుండా వినయ్ కుమార్, నరేష్, వంగూరిరవి, లింగ ప్రసాదు,సైదులు,మధు వర్మ, శ్యామ్ పవన్, కళ్యాణ్, చంద్రయ్య, గణేష్ నిర్వహణ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Sbnews

Sbnews

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2023, 19:49

త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపూరి సోమన్న

త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న

ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్

ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2023, 15:42

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రాంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురువనున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కుమురం భీం ఆసిఫాబాద్‌లో భారీ వర్షాపాతం నమోదైంది.

అత్యధికంగా సిర్పూర్‌(టీ)లో 11.3 సెంటీమీటర్ల వర్షాపాతం కురిసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి గురువారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 19:16

తిప్పర్తి మండలం లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ జన్మదిన వేడుకలు

తిప్పర్తి లో ఘనంగా సుధీర్ జన్మదిన వేడుకలు

తిప్పర్తి మండల కేంద్రంలోని తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ జన్మదిన వేడుకలు తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతొ కలిసి కేక్ కట్ చేశారు పాఠశాలలో విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు

తిప్పర్తి మండలం కేంద్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు కావడంతో మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి ఘనంగాజన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి. మండల పార్టీ అధ్యక్షులు.జూకూరి రమేష్ .పాదూరి శ్రీనివాస్ రెడ్డి తిప్పర్తి ఎంపిటిసి 1 పల్లె ఎల్లయ్య. రాజుపేట ఎంపీటీసీ బత్తిని మట్టయ్య గౌడ్.

కిషోర్ యాదవ్ బొల్లెద్దు అంబేద్కర్ పిసిసిసోషల్ మీడియా గండమల్ల మనోహర్. పల్లపు వెంకన్న. ఆదిమూలం ప్రశాంత్. తండు సతీష్ గౌడ్ 

ఏపూరి ఆనంద్. మాతంగి శోభన్. ఎస్.కె అలీ. సంజీవ. వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 18:41

బీసీ డిక్లరేషన్ ప్రకటించాలనీ రేవంత్ రెడ్డి కి వినతి పత్రం

బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్ 

న్యూఢిల్లీ: తెలంగాణ రానన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఢిల్లీ లో టిపిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఏనుముల రేవంత్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు పల్లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బి సి డిక్లరేషన్ ప్రకటించాలనీ బిసి విద్యార్థి సంఘం నేత వీరబోయిన లింగయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది

అనంతరం రాజ్య సభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ యాదవ్, బీద మస్తాన్ రావు ,మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారూ హాజరై జంతర్ మంతర్ వద్ద పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలని అదేవిధంగా జనగణలో కులగలన చేయాలి చట్టసభల్లో బీసీలకు 55% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు ప్రత్యేక మంతుతో శాఖ ఏర్పాటు చేయాలలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాధర్న నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో బారి అశోక్, ఈదుల రమేష్ చంద్ర పల్లగొర్ల రాందేవ్ మోడీ అరవిందు తెలుగు రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 18:36

బీఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి

ఈరోజు 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధనపేట శాసనసభ్యులు అరూరి రమేష్ గారి సమక్షంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 20 మంది పైగా చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని రాబోయే ఎన్నికల్లో వర్ధన్నపేట లో మూడో సారి బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కష్ట పడాలని కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటు వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిపారు..

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు 

రెనుకుంట్ల యశోద

పెండ్యాల వీనస్ రాజు

సురేష్ రెనుకుంట్ల

సంగాల రాకేష్ 

రామంచ రాజు

భరత్ 

సంగాల విజయ్

సంగాల సనత్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది

ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్

జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సంగాల విక్టరీ బాబు, ఎర్రగట్టు గుట్ట దేవస్థాన చైర్మన్ చింతల లక్ష్మన్, 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్రోజు మనింద్రనాథ్, PACs చైర్మన్ మెరుగు రాజేష్,55వ డివిజన్ యూత్ అధ్యక్షులు గుంజే సాయి కుమార్

భీమారం గ్రామ శాఖ అధ్యక్షులు రాయికంటి సురేష్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంగాల చిన్న, రాయికంటి సుధాకర్, SC సెల్ అధ్యక్షులు నమిండ్ల రవీందర్, జిల్లా నాయకులు పోగుల రమేష్, గజాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గజాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.